బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన హ‌నీరోజ్‌.. ఏకంగా ప‌వ‌ర్ స్టార్ మూవీలో ఛాన్స్‌?!

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ హ‌నీరోజ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా వ‌చ్చిన `వీరసింహారెడ్డి` మూవీతో హ‌నీరోజ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఇందులో బాల‌య్య‌కు మ‌ర‌ద‌లిగా, త‌ల్లిగా డ‌బుల్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో అద‌ర‌గొట్టింది. వీర‌సింహారెడ్డి త‌ర్వాత తెలుగు తెర‌పై హ‌నీరోజ్ మ‌ళ్లీ క‌నిపించ‌క‌పోయినా.. సోష‌ల్ మీడియా ద్వారా క‌వ్వించే ఫోటోషూట్ల‌తో ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

అయితే తాజాగా తెలుగులో హ‌నీరోజ్ ఓ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది. ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీలో ఆమెకు ఛాన్స్ వ‌చ్చిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `ఉస్తాద్ భగత్ సింగ్` ఒక‌టి. హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని మరియు వై. రవిశంకర్ ఈ మూవీని నిర్మిస్తుండ‌గా.. దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం తాజాగా హ‌రీష్ శంక‌ర్.. హ‌నీరోజ్ ను సంప్ర‌దించాడ‌ట‌. త‌న‌కు పాత్ర‌కు మంచి ప్ర‌ధాన్యత ఉండ‌టం, పైగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ కావ‌డంతో హ‌నీరోజ్ వెంట‌నే ఓకే చెప్పేసింద‌ట‌. త్వ‌ర‌లోనే హ‌నీ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ షూటింగ్ లో జాయిన్ కానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.