గోపీచంద్ సినిమాలో కొత్త ట్విస్ట్.. స్పెషల్ ట్రాక్ ..!

మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే‌. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ కామెడీ ట్రాక్ ఉందట. ఈ ట్రాక్ కోసం ఓ భారీ సెట్ ను వేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి శ్రీను వైట్ల, గోపీచంద్ తో ఏ రేంజ్ లో కామెడీ ట్రాక్‌ను నడిపిస్తాడో చూడాలి. ఈ సినిమాలో గోపీచంద్ సెటప్ అండ్ గెటప్ చాలా థ్రిల్లింగా ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని చిత్రాలయ స్టూడియోస్ సంస్థపై ప్రొడక్షన్ నెంబర్1 గా వేణు దోనేపూడి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు వివరాలు ప్రకటించాల్సి ఉంది. అలాగే ఈ సినిమాకి ” విశ్వం ” అనే టైటిల్‌ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాకి ఆ టైటిల్ అయితే సరిపోతుందని అనుకుంటున్నారట. గోపీచంద్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా కథా ఎలా ఉన్నప్పటికీ తన నటనతో అందరిని ఆకట్టుకుంటాడు. లేటెస్ట్‌గా వచ్చిన రామబాణం, పక్కా కమర్షియల్ సినిమాలలో త‌న న‌ట‌న‌తో ఆడియన్స్ ని మెప్పించినా ఊహించిన రేంజ్‌లో స‌క్స‌స్ అందుకోలేక‌పోయాడు. మరి ఈ సినిమాతో అయినా గోపీచంద్ త‌న ఖాతాలో మంచి హిట్ కొడ‌తాడో లేదో చూడాలి.