ఆ విషయంలో నమ్మించి డైరెక్టర్ మోసం చేశాడంటున్న తొట్టెంపూడి వేణు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో గా అద్భుతమైన పాత్రలలో నటించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన తొట్టెంపూడి వేణు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇండస్ట్రీలో హీరోగా ఎంతో సక్సెస్ అందుకున్న ఆ తర్వాత కొన్ని సినిమాలలో అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇటీవలే అతిధి అని ఒక వెబ్సైట్ చేస్తూ మంచి పాపులర్ కి అందుకున్నారు. వేణు చిత్రాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులలో కూడా నటించారు తొట్టెంపూడి వేణు.

తొట్టెంపూడి వేణు డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో వచ్చిన దమ్ము సినిమాలో కూడా నటించారు. ఇందులో ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అలా ఈ సినిమాతో కం బ్యాక్ ఇవ్వాలనుకున్న వేణు నిరాశకు గురి చేసిందట. ఇలా ఈ సినిమా తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వేణు తిరిగి రవితేజ హీరోగా నటించిన రామారావు ఆర్ డ్యూటీ అనే చిత్రంలో కూడా నటించారు. ఇది కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు మాట్లాడుతూ.. దమ్ము సినిమాలో ఈయన పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదని.. చివరికి తన పాత్ర ఇందులో చనిపోవడంతో గుర్తింపు రాలేదని ఈ విషయం గురించి వేణు మాట్లాడుతూ.. బోయపాటి శ్రీను గారు దమ్ము కథ అసలు తనకు చెప్పలేదని ఒకవేళ సినిమా కథ కనుక తనకు చెప్పి ఉంటే నేను ఈ సినిమాలో నటించేవాడిని కాదంటూ తెలిపారు. కేవలం ఈ సినిమాలో నీ పాత్ర షోలే సినిమాలో అమితాబు పాత్ర లాగా ఉంటుందని చెప్పారట. ఈ సినిమా కమిట్ అయిన తర్వాత సినిమా విడుదలై ప్లాప్ టాక్ ను మూట కట్టుకుంది. ప్రస్తుతం వేణు చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.