రామ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న యంగ్ హీరో..

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గతంలో రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ త‌న‌ ఖాతాలో వేసుకుని ఓవర్ నైట్ స్టార్ హీరోగా క్రేజ్ ద‌క్కించుకున్నాడు. అదే జోష్ తో వచ్చిన రామ్ ది వారియర్ సినిమా దెబ్బ కొట్టడంతో మళ్లీ ఫ్లాప్ చెవి చూసాడు. ఇక ఎలాగైనా తరువాత సినిమాతో హిట్ కొట్టాలని బోయపాటి శ్రీను డైరెక్షన్లో స్కంద సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తరికెక్కిన స్కందా సినిమా రిలీజ్ ఐ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

మొదటి రోజు కలెక్షన్స్ అదరగొట్టినప్పటికీ.. తరువాత నుంచి కలెక్షన్ల విషయంలో కాస్త వెనకడుగు వేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే రామ్ పోతినేని గురించి ఓ న్యూస్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. త్వరలోనే ఆ టాలీవుడ్ బ్యూటీ ని రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడట‌. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అనుకుంటున్నారా ఆమె ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్. గతంలో రామ్ – అనుపమ కలిసి ప‌లు సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్యన ప్రేమ చిగురించిందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అనుపమ చేసుకుంటే ప్రేమ పెళ్లి చేసుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో వీరి మధ్యన నిజంగానే ప్రేమ ఉందంటూ న్యూస్ మరింత బలపడింది. అంతేకాదు అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లోనే వీళ్ళిద్దరూ వివాహం కచ్చితంగా జరుగుతుందంటూ టాలీవుడ్ మీడియా నుంచి టాక్ వినిపిస్తుంది. ఇక ఇదే జరిగితే టాలీవుడ్ లో మరో బ్యాచిలర్ హీరో కూడా ఓ ఇంటి వాడవుతాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రామ్ పోతినేని ఫ్యాన్స్ లో పండగ వాతావరణం నెలకొంది.