ఎన్టీఆర్ బామ్మర్ది MAD ట్రైలర్ అదుర్స్..!!

నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం MAD అక్టోబర్ 6 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సునీల్ కుమార్, గోపిక ఉద్యాన్లు హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. ఇందులో నార్ని నితిన్ ఎన్టీఆర్ బావమరిది అన్నట్టుగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే..MAD ట్రైలర్ ని జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.

పూర్తిగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ లవ్ స్టోరీ కామెడీ యాంగిల్స్ ని టచ్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. కామెడీ పంచులు అలాగే కాలేజీలో అల్లరి ఇలా చుట్టూ కుర్రాళ్ల కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్లో అక్కడ కూడా పంచులు కూడా బాగానే పేలుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నటుడు రఘు బాబు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు సైతం ఇందులో కనిపిస్తూ ఉన్నారు.

 

జాతి రత్నాలు డైరెక్టర్ అనిరుద్ కూడా ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో పూర్తిస్థాయిలో కామెడీ సినిమాలు పెద్దగా రాలేదు కాబట్టి MAD సినిమా విడుదల అయితే కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది.ముఖ్యంగా ఎన్టీఆర్ బామ్మర్ది ఉండడంతో ఈ సినిమాకి మరింత ప్లేస్ అవుతుంది ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ తోనే అదుర్స్ అనిపించుకున్న ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్ మరి సినిమాకు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.