రామ్ ‘ స్కంద 2 ‘ పై లేటెస్ట్ క్లారిటీ ఇదే..

యంగ్ అండ్ ఎనర్జిటిక్ రామ్ పోతినేని హీరోగా.. శ్రీ లీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్‌లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ” స్కంద “. ఈ సినిమా సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ ని అందుకుంది. మరి మాస్ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని మెప్పించింది.

ఇక వసూళ్లు పరంగా కూడా రామ్ కెరీర్‌లో సాలిడ్ నెంబర్‌ని రిజిస్టర్ చేసింది. ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా సీక్వల్ ని కూడా మేకర్స్ ఫిక్స్ చేశారు. అయితే క్లైమాక్స్ లోనే రిలీజ్ చేసిన ఈ అంశంపై లేటెస్ట్ క్లారిటీ తెలుస్తుంది. ఈ సినిమాకి ఫైనల్ రన్ ఎలా ఉన్న బోయపాటి మాత్రం సీక్వెల్ ని రెడీ చేయడం అయితే ఖాయమ‌ట‌.

దీనితో స్కంద సీక్వెల్ డెఫినెట్గా రాబోతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక స్కంద సినిమాలో అయితే శ్రీ లీల హీరోయిన్గా నటించింది. మరి ” స్కంద 2 ” లో ఈ ముద్దుగుమ్మకి హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.