మీ గొంతులో నాన్న వినిపించారు చరణ్ అన్న.. తమన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..

నందమూరి నట‌సింహ బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్‌ కేసరి. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక‌ ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్య ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంటాడని బాలయ్య ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీలా బాలకృష్ణకు కూతురుగా నటిస్తుంది. ఎమోషనల్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మూవీ టీమ్‌. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ పాట అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఉయ్యాలో ఉయ్యాల అంటూ సాగే ఈ పాట తండ్రి కూతుళ్ళ మధ్యన అనుబంధాన్ని చూపిస్తుందట‌. అయితే ఈ పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ పాడినట్లు తెలిపాడు. ఇక పోస్టులో తమన్ చరణ్ అన్న ఈ పాటలో మీ గొంతుతో నాన్నను వినిపించారు అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం తమన్‌ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.