మల్లెపూలు అందానికే కాదు ఆరోగ్య ప్రయోజనాలకు కూడ..?

మన చుట్టూ ఉండే పూల మొక్కల వల్ల పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో పూసేటువంటి మల్లెపూలు సువాసన సైతం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అందుకే చాలామంది ఎక్కువగా మల్లె చెట్టులను తమ ఇంటి ఆవరణంలో పెంచుకుంటూ ఉంటారు. అయితే మల్లె చెట్టు మరియు మల్లెపూలు ఇంటికి అలంకారమే కాకుండా పలు రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయట. మల్లె పువ్వులను ఎక్కువగా ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారట. ముఖ్యంగా మల్లె పువ్వుల ఆకులను వేర్లను సైతం అన్ని భాగాలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతోందట.

పూర్వకాలంలో మల్లె చెట్టును సాంప్రదాయంగా ఎక్కువగా వైద్యంలో ఆయుర్వేదంగా కూడా ఉపయోగించేవారు.. ముఖ్యంగా కళ్ళు మంటలుగా ఉన్నప్పుడు మల్లెపూలను కంటి రెప్పల పైన ఉంచుకుంటే చాలా చల్లగా అనిపిస్తుంది.

ఎవరైనా చుండ్రు సమస్యలతో బాధపడేవారు మల్లె పువ్వుల రసాన్ని తలకు పట్టించినట్లు అయితే బిజీ ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోకి కాస్త మెంతులు పొడిని అప్లై చేస్తే చుండ్రు తొలగిపోతుందట.

కొబ్బరి నూనెలో కాస్త మల్లే పూలు వేసి రాత్రంతా నానబెట్టిన తర్వాత ఆ మరుసటి రోజున తలకు రాసుకుంటే సువాసన వెదజల్లుతుంది ఇది వెంట్రుకల అడుగు బాగా వరకు వెళ్లి తలనొప్పి లేకుండా చేస్తూ ఉంటుంది.

శరీరానికి అవసరమైనటువంటి విటమిన్ సి మల్లెపూలలో చాలా పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. చెవి నుండి చీము కారుతున్న సమస్య ఉన్నవారు మల్లె ఆకు చాలా ఉపయోగపడుతుందట.

నోటి పూత సమస్య ఉన్నవారు ఉదయం పూట లేత మల్లె ఆకులను కాస్త నమిలి నోటిని పుక్కలించడం వల్ల అలాంటి సమస్య ఉండదు.

ఇదే కాకుండా తలలో మల్లెపూలు పెట్టుకోవడం వల్ల తలలో పెండ్లు పడవట.