తెర పైకి ఏం మాయ చేసావే 2.. హీరో-హీరోయిన్లు ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలైనా రావచ్చు .. కానీ తెర పై కొన్ని కొన్ని సినిమాలు మాత్రం భలే గమ్మత్తుగా ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిల్లో ఒకటే ఏం మాయ చేసావే. ఇప్పటికే మీరు ఈ సినిమాని వంద సార్లు చూసిన సరే 101 వ సారి చూస్తున్నప్పుడు కొత్త ఫీలింగ్ కలుగుతుంది . అబ్బా ఇది ఎంత బాగుంది అనిపిస్తుంది . అంతటి ఫీల్ గుడ్ రొమాంటిక్ గా తెరకెక్కించాడు గౌతమ్ వాసు దేవ్ మీనన్.

ఈ సినిమా అప్పట్లో ఎన్ని ప్రభంజనాలు సృష్టించిందో మనకు తెలిసిందే. కాగ ఇన్నాళ్లకు ఏం మాయ చేసావే 2 సెట్స్ పైకి రాబోతుంది అంటూ ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు ఈసారి హీరో హీరోయిన్లుగా రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండ ను చూస్ చేసుకున్నారట వాసుదేవ్ మీనన్.

నాగచైతన్య – సమంత విడాకులు తీసుకోవడం.. ఈ సినిమాలో నటించడానికి యాక్సెప్ట్ చేయకపోవడంతో లవ్ బర్డ్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక – విజయ్ ఈ సినిమాలో చూస్ చేసుకున్నారట . చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సూపర్ డూపర్ హిట్ ని అందుకుంటుందో..?