వెంకటేష్ చేయాల్సిన ఆ హిట్ మూవీని దొబ్బేసిన నవీన్… సురేష్ బాబు రాత్రికి రాత్రే చేతులు మార్చేశాడా…!!

సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కోడి రామకృష్ణ ఒకరు. ఈయన తెరకెక్కించిన చాలా సినిమాలు అప్పట్లో మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఆయన చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరోతోను సినిమా చేసి విజయాలను సొంతం చేసుకున్నారు.

ఇక ఈయన వన్డే నవీన్ తో చేసిన ” పెళ్లి ” సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా ముందుగా వెంకటేష్ తో చేద్దామని అనుకున్నాడట కోడి రామకృష్ణ. కానీ ఆ కథ, సురేష్ బాబు విని అది వెంకటేష్ కి అంత బాగా సెట్ అవ్వదు. ఈ సబ్జెక్ట్ కి ఎవరైనా కొత్త హీరో అయితే బాగుంటుందని చెప్పాడట.

దీంతో కోడి రామకృష్ణ నవీన్ ని పెట్టి ఈ సినిమా తెరకెక్కించాడు. ఈ విషయంని కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక నవీన్ కి ఈ సినిమా ద్వారానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అనంతరం పలు సినిమా ఆఫర్స్ కూడా నవీన్ చేతికి వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ వెంకటేష్ ఓ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్నాడనే చెప్పాలి.