బిగ్ బాస్ నుంచి కావాలనే సందీప్ ని ఎలిమినేట్ చేశారా?.. తెర వెనుక ఏం జరిగిందంటే…!!

బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ ఏడువారాలు కాచుకుని కూర్చుని సందీప్ మాస్టర్ ని బయటకు పంపించేశారు. కావాలనే బయటకి తరిమేశారు. గతంలో రతికని కూడా ఇలా ఓవరాక్షన్ చేస్తుందని ఓట్లు వేయడం మానేశారు. దాంతో ఆమె బయటకు వెళ్ళిపోయింది. ఏదో అదృష్టం బాగుండి రీఎంట్రీ ఇచ్చింది. ఇలా ఆడియన్స్ ప్రవర్తన ఈ సీజన్లోనే ఇలా ఉంది. సందీప్ చాలా బాగా ఆడినప్పటికీ ఓట్లు వేయకుండా ఎలిమినేట్ చేసేసారు. దానికి అతి ముఖ్యమైన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆడియన్స్ కోరుకున్నట్టుగానే సందీప్ నామినేషన్స్ లో అడుగు పెట్టాడు. అలాగే వాళ్లు అనుకున్నట్టుగానే నామినేట్ చేశారు. నిజానికి ఫౌల్ గేమ్ అనేది మాస్టర్ కొంప ముంచింది. ఆటలో లూప్స్ పట్టుకునో, లేదా అందరికంటే తెలివిగా స్మార్ట్ గా ఆడానని నిరూపించుకోవడానికి చేసిన పనులు బెడిసి కొట్టాయి. దీంతో అలా నామినేషన్స్ లోకి వచ్చాడో లేదో.. అలా పంపించేశారు.

2. మరో రీజన్ ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచి సందీప్.. నామినేషన్స్‌ బలమైన పాయింట్స్ తో వెయ్యలేదు. సిల్లీ రీజన్స్ తో వేయడం కూడా బెడిసి కొట్టిందని చెప్పొచ్చు.

3. మూడవ రీజన్ ఏమిటంటే టైటిల్ కొట్టడానికి ఆడే గేమ్ ఇది కాదు. స్ట్రాటజీలతో ఆడాలి. మన వైపు ఆడియన్స్ వచ్చేలా పాయింట్స్ పట్టుకోవాలి. అప్పుడే ఆడియన్స్ ఓట్లు వేస్తారు.

4. అన్నిటికన్నా ఇదే అసలైన పాయింట్. స్టార్ మా బ్యాచ్ అనే ముద్ర పడిపోయింది. తెలిసి చేశారో, తెలియక చేసారో కానీ ఫస్ట్ వీక్ ప్రియాంక, సందీప్ కంటెండర్స్ అయినప్పుడు.. మిగతా హౌస్మెట్స్ అందరూ శివాజీని, రతికాని ఎలిమినేట్ చేశారు. దీంతో క్యాప్టెన్సీ రేస్ నుంచి తప్పించారు. ఇప్పుడు ఏకంగా హౌస్ నుంచే తప్పించేశారు.

5. ఐదో పాయింట్ ఏమిటంటే.. సోషల్ మీడియాలో మాస్టర్ కి పెద్దగా ఫాలోయింగ్ లేదు. పైగా 7 వారాల నుంచి నామినేషన్స్ లోకే రాలేదు. దీంతో అలా అడుగు పెట్టాడో లేదో ఇలా వచ్చేసాడు.

ఏదేమైనాప్పటికీ బిగ్ బాస్ హౌస్ లో నుంచి సందీప్ ని గెంటేశారు. బిగ్బాస్ డైరెక్ట్ గా చెప్పకపోయినా.. పక్కకి వెళ్లి ఆడుకో అన్నట్లే చేశాడు.