టాప్ 5కి చేరేందుకు పల్లవి ప్రశాంత్ కు నాగార్జున బూస్టప్.. ఏం చేశాడంటే..?

ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 7 రసవ‌త్త‌రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అత్యధిక టిఆర్పితో దూసుకుపోతున్న ఈ సీజన్ 2.0 ఉల్టా పల్టా పేరుతో మొదలై టైటిల్ కు తగ్గట్టుగానే చాలా డిఫరెంట్‌గా రన్ అవుతుంది. ముందుగా 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ కాగా నలుగురు ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఐదుగురిని హౌస్ లోకి పంపాడు. ఇక తర్వాత గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూమ్‌లో పెట్టిన బిగ్‌బాస్ సడన్‌గా అతని బయటకి తీసుకువచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు.

గతంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దామిని, శుభశ్రీ, రతికలను ఇంట్లోకి పంపి వీరి ముగ్గురిలో మీ ఓటింగ్ ద్వారా ఒకరు లోపలికి వస్తారంటూ చెప్పాడు. దీంతో అంతా తమకు నచ్చిన వారికి ఓట్లు వేయగా చివరికి తక్కువగా ఓట్లు వచ్చిన వారు ఇంట్లోకి వస్తారని షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో రతిక బిగ్‌బాస్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే తాజా ఎపిసోడ్‌లో పూజ మూర్తి ఎలిమినేట్ అయింది. అయితే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కు నాగార్జున టాప్ 5 లోకి వచ్చేందుకు బూస్టింగ్ గా ఓ స్పెషల్ గిఫ్ట్‌ను అందించాడు.

ఎందుకంటారా నామినేషన్స్ నుంచి సేవ్ చేయడంలో భాగంగా పల్లవి ప్రశాంత్ కోసం వాళ్ళ నాన్న చేత ఓ వీడియో చేయించాడు. కొడుకా నువ్వు సేఫ్‌ అయ్యావ్ అంటూ అందులో వాళ్ళ నాన్న చెప్పడం నిన్నటి షోలో హైలెట్ గా మారింది. ముఖ్యంగా కొడుకా మేం బాగున్నాం.. మంచిగా ఆడుతున్నావ్.. అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు అంటూ వాళ్ళ తండ్రి చెప్పిన వీడియో అదిరిపోయింది. మన ఎపిసోడ్‌లో పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు పంపిన లేఖన చదివాడు.

ఆ తర్వాత చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు. ఇదే క్రమంలో మరో వీడియోలు పల్లవి ప్రశాంత్ కు చూపడంతో మరింత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తెగ మురిసిపోతూ బాపు బాపు అంటూ ఆనందభాష్పాలు కార్చాడు. ఈ ఊపు చూస్తుంటే పల్లవి ప్రశాంత్ కచ్చితంగా టాప్ 5కి వచ్చేలా కనిపించాడు. సీరియల్ గ్రూప్ కాస్త వేరు చేసి చూస్తున్నా.. నాగార్జున ఇచ్చిన బూస్టప్ తో పల్లవి ప్రశాంత్‌ మరింత దూసుకుపోతాడని అందరు భావిస్తున్నారు. నిజానికి పల్లవి ప్రశాంత్ కు బయటి నుంచి వస్తున్న సపోర్ట్, ఆదరణ చూస్తే ఫైనల్ వరకు కచ్చితంగా వస్తాడు అన్నది క్లియర్గా తెలుస్తుంది. అయితే అది జరుగుతుందా లేదా వేచి చూడాలి.