ఆది పురుష్ మూవీ హనుమాన్ టాలీవుడ్ ఎంట్రీ.. మహేష్ మేనల్లుడి సినిమాలో పవర్ ఫుల్ రోల్..?!

తెలుగు ప్రేక్షకులకు హీరో అశోక్ గల్లా గురించి ప్రత్యేక పరిచ‌యం అక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అశోక్ గల్లా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాతో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న అశోక్ గ‌ల్లా తన రెండవ సినిమాలు అర్జున్ జంధ్యాల డైరెక్షన్లో నటించబోతున్నాడు. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించాడు. లలితాంబిక ప్రొడక్షన్ నెంబర్ వన్ గా ఎన్నారై ఫిలిం డిస్ట్రిబ్యూటర్ సోమినేని బాలకృష్ణ ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.

సాగర్ సాహూ నిర్మాతగా నల‌ప‌నేని యామిని సమర్పణలో ఈ సినిమా రూపొందిపోతుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విలన్ గా ఆది పుష్ ఫేమ్ దేవదత్ నాగి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఆది పురుష్‌లో హనుమాన్ పాత్రలో నటించి ప్రేక్షకులందరికీ ఆకట్టుకున్న దేవదత్ నాగి ఈ సినిమాలో కంసరాజు అనే పవర్ఫుల్ రోల్లో నటించబోతున్నారు. ఇక ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయగా అందులో కత్తి పట్టుకుని వైలెంట్ లుక్ లో కనిపించాడు.

అదిపురుష్ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోయినా మంచి మార్కులు కొట్టేసిన దేవదత్త ఈ సినిమాతో అయినా హైట్ అందుకుంటాడేమో చూడాలి. అశోక్ కి జంటగా మిస్ ఇండియా 2020 మానస వారణాసి నటిస్తుంది. ఇక హిట్ సినిమాలైనా ధమాకా బలగం లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన కంపోజర్ బీమ్ సిసిరోలియో సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రసాద్ మూరెళ్ళ సినిమా ఆటోగ్రాఫర్ గా తమ్మి రాజు ఎడిటర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.