మరోసారి మంచి మనసు చాటుకున్న చిరంజీవి.. చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చేసే సేవా గుణం గురించి ఎంత చెప్పినా తక్కువే.. అభిమానులకే కాకుండా తోటి కళాకారులకు తన శ్రేయోభిలాషులకు తన స్నేహితులకు కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఉంటారు చిరంజీవి.. తాజాగా తన చిన్ననాటి స్నేహితుడు ఆరోగ్య విషయం తెలుసుకొని వెంటనే హుటాహుటిగా ఆసుపత్రికి బయలుదేరాడు చిరంజీవి.. అక్కడ ఉన్న వైద్యులతో మాట్లాడి తన ఆరోగ్య విషయాలను సైతం తెలుసుకున్నారట.. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే చిరంజీవి మొగల్తూరు ప్రాంతం నుంచి వచ్చిన సంగతి తెలిసింది..అయితే అక్కడ తన చిన్ననాటి మిత్రుడు అయిన పువ్వాడ రాజ పలు అనారోగ్య సమస్యతో గత కొంతకాలంగా బాధపడుతున్నారట.ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తన స్నేహితుడిని హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కి తీసుకువెళ్లి అక్కడ చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.. తన స్నేహితుడు ఉన్న హాస్పిటల్ కి వెళ్లి మరి చిరంజీవి పరామర్శించారు.. అలాగే తన ఆరోగ్యం కూడా తెలుసుకోవడం జరిగిందట.

ఈ విషయం తెలిసి చిరంజీవి అభిమానుల సైతం తెగ సంబరపడిపోతున్నారు. చిరంజీవి తన కుటుంబ సభ్యులకే కాకుండా తన స్నేహితులకు కూడా ఇలాంటి సహాయాలు చేస్తూ ఉండడంతో పొగిడేస్తూ ఉన్నారు. చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 157 వ సినిమాని చేస్తూ ఉన్నారు. ఈ సినిమాని డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉండడం జరుగుతోంది. షోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది .ఈ సినిమాలోని చిరంజీవి పాత్ర తన ఏజ్ కు తగ్గట్టుగానే ఉండబోతుందని సమాచారం.