ఆ తప్పు వల్లే మోహన్ బాబుకు ఈ పరిస్థితి ఏర్పడిందా..!!

తెలుగు ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఉన్నారు. అందులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో నటుడు మోహన్ బాబు కూడా ఒకరు.. గతంలో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు తనని మోసం చేశారని అప్పట్లో పలు విషయాలు తెలియజేయడం జరిగింది.. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి అప్పట్లో హెరిటేజ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థల మోహన్ బాబు పర్సంటేజ్ ఎక్కువగా ఉండడంతో చంద్రబాబు నాయుడు తనని మోసం చేశారంటూ తెలియజేయడం జరిగింది.

హెరిటేజ్ సంస్థలో మోహన్ బాబుకి ఎక్కువ పర్సంటేజ్ ఉండడంతో మోహన్ బాబు ప్లేస్ లో ఇంకొకరిని తీసుకువచ్చి తనని మోసం చేశారని తెలిపారు.. గతంలో చంద్రబాబు నాయుడుని వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పరిచయం చేశారట.ఇక చంద్రబాబు దగ్గర నుంచి మోసపోయిన మోహన్ బాబుని రాజశేఖర్ రెడ్డి తనను తన పార్టీలో చేర్పించుకున్నారట. ఆ తర్వాత మోహన్ బాబు టిడిపి పార్టీ నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బంధువు అవ్వడంతో ఇలా చేసినట్టు సమాచారం.

ఇప్పుడు సీఎం జగన్ అయిన తర్వాత మోహన్ బాబు వైయస్సార్సీపీ పార్టీలో గత కొద్దిరోజులుగా కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం ఆ పార్టీ నుంచి కూడా బయటికి వచ్చేసి సైలెంట్ గా ఉన్నారు. మోహన్ బాబు చంద్రబాబు నాయుడు చేతిలో ఇటు వైయస్సార్ ఫ్యామిలీ చేతిలో మోసపోయినట్టుగా ఆయన అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల జోలికి పోకుండా కేవలం సినిమాలను తెరకెక్కిస్తూ తన బిజినెస్లను మాత్రమే చూసుకుంటూ ముందుకు వెళుతున్నారు. మోహన్ బాబు చేసిన ఈ తప్పే ఇలాంటి పరిస్థితుల్లో నిలబెట్టిందని పలువురి న
నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.