నేను నటించిన ఆ సినిమా చరణ్ మళ్ళీ చేస్తే చూడాలని ఉంది.. చిరంజీవి కామెంట్స్..

టాలీవుడ్‌కి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగాస్టార్ కూడా ఒకరు. సాధారణ కానిస్టేబుల్ కుమారుడుగా ఎంట్రీ ఇచిన్న చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచాడు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా మెగాస్టార్ గా సక్సెస్ అందుకున్న చిరంజీవి సినీ కెరీర్‌లో దాదాపు 150 కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు వరుస సినిమాల్లో నటించే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన చిరంజీవి సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బ‌స్టర్ హీట్లను ఖాతాలో వేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడుగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ గడుపుతున్నాడు. ఇక చిరంజీవికి మీడియా నుంచి మీరు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో ఏదైనా చరణ్ చేస్తే చూడాలని ఉందా అని ప్రశ్న ఎదురుకాగా.. చిరంజీవి ఆన్సర్ చెప్తు తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టాడు. తను నటించిన సినిమాలలో రామ్ చరణ్ నటించాల్సివస్తే జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో నటించాలని కోరుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఆ సినిమాలో హీరోయిన్గా ఎవరి నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు అని చిరంజీవిని అడగగా.. శ్రీదేవి కూతురు ఉందిగా అంటూ సమాధానం చెప్పాడు. దీంతో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ నటిస్తే బాగుంటుందని చిరంజీవి చెప్పక‌నే చెప్పాడని అందరికీ క్లారిటీ వచ్చింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా రామ్ చరణ్ జాన్వి తో కలిసి జగదేకవీరుడు అతిలోకసుందరిలో నటిస్తాడా లేదా అనేది వేచి చూడాలి. ఈ సినిమా కనుక వెండితెరపై వస్తే మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. వస్తే బాగుండని కామెంట్ చేస్తున్నారు.