కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ అవుట్.. ఆ ప్లేస్ లోకి మరో టిలీవుడ్ పాన్ ఇండియన్‌ హీరో..?

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ మంచు విష్ణు నిర్మిస్తున్న కన్నప్ప సినిమాలో శివుడు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నయనతార పార్వతి దేవిగా కనిపించబోతుందంటూ న్యూస్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తూ ఉండడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ కలిగించే ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గ‌ ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ప్రభాస్ తప్పుకున్నాడట‌. బన్నీ ఈ మూవీలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభాస్ ఫాన్స్ ఇది జరగదని ప్రభాస్ అలాంటి పాత్రలో నుంచి తప్పుకోడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరికొందరు ఏవో కారణాల చేత ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని ఉంటాడ‌ని భావిస్తున్నారు. ఇక ప్రభాస్‌ తప్ప శివుడు పాత్రలో మరెవ్వరూ ఈ సినిమాకు సెట్ కారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజ‌న్లు. ఇక ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకుంటే ప్రభాస్ క్రేజ్ మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.