డైరెక్టర్ నాగ అశ్విన్ పై రానా అలక.. కారణం ఏంటంటే..?

ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కల్కి 2898 సినిమాల్లో ప్రభాస్ నటించబోతున్నాడు. టైం ట్రావెలర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి డైరెక్టర్ నాగ అశ్విన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్నాడు. ఇక రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ వీడియో రిలీజై ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మారో పోస్టర్ లేదా గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే అమితాబచ్చన్, కమలహాసన్ లాంటి ఎంతోమంది పాన్‌ ఇండియన్ స్టార్ సెలబ్రిటీలో నటించబోతున్నారు. అదేవిధంగా దుల్కర్ సల్మాన్, దిశాపటని కూడా కీలక పాత్రలో చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా సెట్స్‌లోకి రీసెంట్ గా రానా దగ్గుబాట్టి హాజరయ్యాడట. అడుగుపెట్టగానే ఒక కొత్త ప్రపంచంలో అడుగుపెట్టిన అనుభూతి రానాకి కలిగిందంటూ రానా చెప్పుకొచ్చాడు. సినిమాకి సంబంధించిన పూర్తి స్టోరీ నాకు తెలియదు నాతో ప్రభాస్ కూడా ఏమి చెప్పలేదు.. కానీ నాగ అశ్విన్ మేకింగ్ స్టైల్ చూస్తుంటే జలస్ వస్తుంది.. అంటూ రానా కామెంట్స్ చేశాడు.

నాతో ఇలాంటి ప్రాజెక్ట్ చేయమని ఎప్పటినుంచో నాగ అశ్విన్‌ని నేను అడుగుతున్నాను.. కానీ పట్టించుకోలేదు. అందుకే లోకేషన్ కి వెళ్ళిన రోజు నేను నాగ అశ్విన్ తో సరిగా మాట్లాడలేదు అంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ మోడల్ మహా విష్ణువు గా కనిపించబోతున్నాడట. అమితాబచ్చన్ అశ్వద్ధామ పాత్రలో ఎక్కబోతున్న ఈ సినిమా ఎన్నో ప్రత్యేకతలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రిలీజ్ డేట్ కూడా ఈరోజు రాబోయే పోస్టర్‌లో చెప్తారంటూ స‌మాచారం.