రావణుడి పాత్ర కోసం యష్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?

కే జి ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ కి సౌత్ లో స్టార్ హీరోగా పేరుపొందిన యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కని విని ఎరుగని రీతిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్లిన కే జి ఎఫ్ చిత్రాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. అయితే గత కొద్దిరోజుల నుంచి కేజిఎఫ్-3 మేకింగ్ జరుగుతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అయితే ఇప్పుడు తాజాగా నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఒక సినిమాలో యశ్ రావణుడి పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

ఇందులో రాముడు పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తూ ఉండగా సీత పాత్రలో ఆలియా భట్ నటిస్తున్నది. మరొకవైపు దక్షిణాది నటి సాయి పల్లవి కూడా సీత పాత్రలు నటించడానికి చిత్ర బృందం సంప్రదించారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో నటించేందుకు యష్ కూడా చాలా పారితోషకం తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

యష్ బాలీవుడ్ వర్గాలలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది .అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే ఇంకా వెలుబడలేదు. కానీ బాలీవుడ్ రామాయణం షూటింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ బాలీవుడ్ రామాయణం ప్రేక్షకుల హృదయాలలో ఎలాంటి స్థానం సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉన్నది. యష్ కూడా మొదటిసారి బాలీవుడ్లో అడుగు పెట్టబోతు ఉండడంతో ఎలాంటి రికార్డులను సృష్టిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.