HBD: నేడు ప్రభాస్ పుట్టిన రోజు.. ప్రభాస్ గురించి తెలియని విషయాలు ఇవే..!!

టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్నారు. జపాన్ వంటి ఇతర దేశాలలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తన కెరీర్ ని మొదలుపెట్టి దూసుకుపోతున్నారు. ఈ రోజున ప్రభాస్ 44వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో మొదటిసారి తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వర్షం చత్రపతి, డార్లింగ్ తదితర సినిమాలలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు.

బాహుబలి సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ప్రభాస్ మిగతా హీరోల కంటే సోషల్ మీడియాలో కాస్త ఆలస్యంగా ఎంట్రి ఇచ్చిన మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. కానీ బాహుబలి సినిమా ఇచ్చిన సక్సెస్ ఆ తర్వాత మరే సినిమా ఇవ్వలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ప్రభాస్ నటుడు గానే కాకుండా మంచి మనసున్న వ్యక్తి అని కూడా చెప్పవచ్చు. తనకు నచ్చిన వారిని అసలు వదిలిపెట్టకుండా వారికోసం ఎలాంటి పనిచేయడానికైనా సిద్ధంగానే ఉంటారని టాప్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ప్రభాస్ కెరియర్లు మొదటిసారి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ హఠాత్తుగా మరణిస్తే అతను కొడుకు బాధ్యతలను ప్రభాస్ తీసుకున్నారు ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు అడుగుపెట్టిన ప్రభాస్ వర్షం మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. దర్శకుడు శోభన్ తో ప్రభాస్ కు మంచి బాండింగ్ ఏర్పడింది.ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో సినిమా వినిపించలేదు. 2008లో వర్షం డైరెక్టర్ శోభన్ మరణించగా శోభన్ తనయుడు సంతోష్ శోభనకు ప్రభాస్ అండగా నిలుస్తూ అవసరమైన సమయంలో అన్నగా నిలబడ్డారు.

సంతోష్ శోభన్ సినీ కెరీర్ని గాడి పెట్టేందుకు ప్రభాస్ తన వంతు సహాయం చేస్తూనే ఉన్నారు. అలాగే తన స్నేహితులతో కలిసి UV క్రియేషన్ సంస్థను స్థాపించి పలు సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. తన కుటుంబాన్ని నమ్ముకున్న వ్యక్తులను చాలా బాగా ఆదరిస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి పుట్టినరోజులు ప్రభాస్ మరెన్నో జరుపుకోవాలని అభిమానులు తెలుపుతున్నారు.