అనిల్ రావిపూడి నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తున్నాడో తెలుసా..? నో డౌట్..హిట్ పక్క..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్లు ఉన్న వాళ్ళందరికీ మించిన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన అనిల్ .. ఆ తర్వాత ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న సినిమాలను తెరకెక్కించి హిట్ ట్రాక్లోకి వచ్చాడో మనం చూడొచ్చు .

మరీ ముఖ్యంగా ఎంత పెద్ద స్టార్ హీరోతోనైనా సరే కామెడీని చేయించి నవ్వించడం అనిల్ రావిపూడికే సాధ్యమైంది . రీసెంట్గా భగవంత్  కేసరిలో బాలయ్యను ఎలా డిఫరెంట్ షేడ్స్ పాత్రలో చూపించి నందమూరి అభిమానులను సైతం మెప్పించాడో మనం చూసాం . కాగా ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి పేరు మరో రేంజ్ లో మారుమ్రోగిపోతుంది .

అయితే ఇంత పెద్ద హిట్ అందుకున్న అనిల్ తన నెక్స్ట్ సినిమాను ఏ హీరోతో తీయబోతున్నాడు అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాను రవితేజతో చేస్తున్నాడట . రాజా ది గ్రేట్ తర్వాత మళ్లీ వీళ్ళ కాంబో సెట్ అవుతుంది . ఈసారి కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటున్నారు జనాలు..!!