ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ తెలుగు యంగ్ హీరో ఆఫర్ ను రిజెక్ట్ చేసిందా..? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఎన్టీఆర్ దేవరా సినిమాతో డెబ్యూ ఇవ్వబోతున్న జాన్వికపూర్ కు తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి .
కానీ అమ్మడు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . ఈ క్రమంలోనే తెలుగు యంగ్ హీరో సినిమాలో ఆఫర్ వచ్చింది . కథ ప్రకారం సూపర్ డూపర్ హిట్ సినిమా అయినా సరే అమ్మడు ఆ హీరోని రిజెక్ట్ చేసింది . దానికి కారణం ఆ హీరోకి పెద్దగా క్రేజ్ పాపులారిటీ లేకపోవడమే అంటూ తెలుస్తుంది .
అంతేకాదు క్రేజ్ లేని హీరోలతో 10 సినిమాల్లో నటించిన ..క్రేజ్ ఉన్న హీరోతో ఒక్క సినిమా నటించిన ఒకటే అన్న స్ట్రాటజీను అప్లై చేస్తుందట . అందుకే ఈ హీరో సినిమాను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది . దీంతో ముంబై తెలివితేటలు ఇక్కడ చూపిస్తున్నట్లు ఉంది ఈ జాన్వీ కపూర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!