ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చదువుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

ప్రస్తుతం సినిమా సంగీత రంగాన్ని ఏలుతున్న యువరాజు అనిరుద్ రవిచందర్. 33 ఏళ్ళ ఈ కుర్ర మ్యూజికల్ మాస్ట్రో, తన బాణీలతో భారతదేశ సినీ ప్రపంచాన్ని ఊపేస్తున్నాడు. గత ఐదేళ్లుగా కోలీవుడ్ మొత్తం ఇతని వెనకే పడుతోందంటే అందులో అతిశయోక్తి లేదు. తాజాగా అట్లీ దర్శకత్వంలో, బాలీవుడ్ బాదుషా షా రుఖ్ ఖాన్ నటించిన పాన్ ఇండియా చిత్రం “జవాన్”. ఈ చిత్రానికి అనిరుద్ అందించిన సంగీతం పాన్ ఇండియా ప్రేక్షకులను సైతం మెప్పించింది. ఈ సినిమాతో అనిరుద్ క్రేజ్ దేశమంతా వ్యాపించింది. దీంతో అనిరుద్ డిమాండ్ బాగా పెరిగిపోయింది.

అనిరుద్ చాలా చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించాడు. అతని తండ్రి రవిచందర్ ఒక నటుడు. అనిరుద్, సూపర్ స్టార్ రజిని కాంత్ కు వరసకు మేనల్లుడు అవుతాడు. సినీ కుటుంబం నుంచి వచ్చిన అనిరుద్ తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ధనుష్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన తమిళ చిత్రం “త్రీ” కి దర్శకత్వం వహించాడు అనిరుద్. ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బం అప్పట్లో సెన్సేషన్ గా మారింది. ఈ చిత్రంలోని “వై దిస్ కొలవెరి” పాట ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ సంగీత దర్శకుడిగా ఎదిగిపోయాడు అనిరుద్. “అజ్ఞాతవాసి” చిత్రంతో తెలుగు పరిశ్రమలో కూడా అడుగుపెట్టాడు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ఈ సినిమా పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా రజనీకాంత్ హీరో గా విడుదలైన “జైలర్”, విజయ్ హీరోగా తెరకెక్కిన “లియో” చిత్రాలకు కూడా సంగీతం అందించాడు. ఇప్పుడు కొరటాల, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్నా “దేవర” చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు అనిరుద్. ఈ చిత్రానికి అనిరుద్ సుమారు 10 కోట్ల రూపాయలు పారితోషకం అందుకుంటున్నాడని సమాచారం.

ఇంత చిన్న వయసులో, దేశవ్యాప్తంగా ఖ్యాతిని సొంతం చేసుకున్న అనిరుద్, అసలు ఏం చదువుకున్నాడో తెలుసా? అనిరుద్ కి చిన్నప్పటినుంచే సంగీతం అంటే పిచ్చి. రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీద సాధన చేసేవాడు. లండన్ వెళ్లి ప్రముఖ సంగీత కళాశాల “ట్రినిటీ” లో పియానో నేర్చుకున్నాడు. లండన్ లోని “ఫ్యూజన్” అనే బ్యాండ్ తో కొన్నాళ్ళు పని చేసాడు. ఆ తరువాత సౌండ్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా చేసాడు. ఇలా సంగీతం నేర్చుకుంటూనే తన డిగ్రీని పూర్తిచేసాడు.