ప్రశాంత్ ను మళ్లీ ఏడిపించిన రతిక… నోరేసుకుని పడిపోతున్న శోభ శెట్టి.‌‌.!!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ అనేది అమ్మతనం కన్నా ఎంతో విలువైనది. కెప్టెన్సీ వస్తే ఒక వారం పాటు ఇమ్యూనిటీ లభించినట్లే! ఈ లెక్కన ఆ వారం అంతా ఏ పని చేయక్కర్లేదు, నామినేషన్స్ లో ఉండక్కర్లేదు, ఎలిమినేషన్ భయం లేదు. పైగా తన మాటే శాసనం అన్నట్లు ఉంటుంది. అందుకే కెప్టెన్ అవ్వాలని కంటెస్టెంట్లు తహతహలాడుతారు. ఇక ఈవారం క్యాప్టెన్సీ టాస్క్ లో గెలిచింది గౌతమ్ అనీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఇక హౌస్ లో రీఎంట్రీ ఇచ్చిన రతిక వచ్చినప్పటి నుంచి ఇంకా ఏ అలజడి సృష్టించకుండా ఉందేంటి? అనుకునే లోపు మళ్లీ మొదలెట్టేసింది. యావర్ తో నిన్ను, శివాజీ అన్నను తప్ప హౌస్ లో ఎవరిని నమ్మను. మనం ఇద్దరం ఒకే ప్లేట్లో తింటుంటే ప్రియాంక.. మనల్ని లవ్ బర్డ్స్ అన్నది. నీ మనసులో, నా మనసులో ఏం లేదు. ఫ్రెండ్స్ గా ఉన్నాం.. లవ్ కనెక్షన్ ఎట్లా వస్తుంది అని మాట్లాడింది. మరోవైపు ప్రశాంత్ తో తనను అక్క అనొద్దంటూ సతాయించింది. అతడికేమో ఆమె పెట్టిన టార్చర్ గుర్తొచ్చి ఏడుస్తూ అక్క అనే పిలుస్తా అన్నాడు. ఆమె మాత్రం అందుకొప్పుకోలేదు.

చివర్లో శివాజీ కలగజేసుకుని అక్క అని పిలవనవసరం లేదు అంటూ చెప్పాడు. కాసేపటికి బిగ్‌బాస్ ఎంప్టీ ద కంటైనర్ టాస్క్ ఇచ్చాడు. దీంతో శోభ.. నేను ఆడత.. నన్ను ఆడనివ్వకపోతే ఎవరిని ఆడనివ్వను.. నేను ఆడాల్సిందే అంటూ గోరంగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో అర్జున్ ఆమె పోరు భరించలేక శివాజీ, అశ్విని, గౌతమ్ తో పాటు శోభకు చాన్స్ ఇచ్చాడు. ఈ గేమ్ లో గౌతమ్ గెలిచాడు. ఓటమిని తీసుకోలేని శోభ ఏడుపు మొదలెట్టింది. తర్వాత తేజ, శోభాలను బిగ్‌బాస్ ఆట‌ పట్టించాడు.