మహేష్ బాబు ” గుంటూరు కారం ” సినిమా పై థమన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైర‌ల్‌..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా ” గుంటూరు కారం “. ఈ సినిమా షూటింగ్ సర్వేగంగా సాగుతుంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ‌ నిర్మిస్తుంది. దాదాపు 12 ఏళ్ల విరామం తరువాత మహేష్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

అతి త్వరలో ఫస్ట్ సింగిల్ కి రెడీ అవుతున్న ఈ సినిమా.. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అసలు మేటర్ ఏమిటంటే.. గుంటూరు కారం గురించి తాజాగా థమన్ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఇచ్చాడు.
త్రివిక్రమ్ గారు మరియు గుంటూరు కారం గురించి ఒక్క మాట చెప్పండి చాలు అంటూ ట్విట్టర్ లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు థమన్ ఈ విధంగా బదులిచ్చాడు.

” జనవరి 12న మీరు విజువల్ గా అలానే చెవులు అదిరిపోయేంతటి లౌడ్ నెస్ ని చూస్తారు ” అంటూ బ్లాస్టింగ్ గా పలు ఏమో జీస్ ద్వారా తెలిపాడు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో సంబరాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ఫస్ట్ సాంగ్ త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7న రిలీజ్ చేయబోతున్నారంటూ టాక్ వినిపిస్తుంది. ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.