బిగ్‌బాస్ హౌస్‌లో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తుంది. ఇప్పటికే రెండు టాస్కులు జరగగా వాటిలో ప్రియాంక, ప్రశాంత్ గెలిచి కంటెండర్లుగా నిలిచారు. అమర్, రతీక ఆటలో నుంచి అవుట్ అయ్యి రేసులోనే లేకుండా పోయారు. ఇక మిగిలిన కంటెస్టెంట్లు కోసం నేడు బిగ్ బాస్ మరిన్ని టాస్కులు పెట్టనున్నాడు.
నిన్న అయినా టాస్క్ లో షవర్ కింద స్పాంజ్ ఉన్న హెల్మెట్ పెట్టుకుని నిలబడాలి. తర్వాత ఆ స్పాంజ్ లోని నీళ్లను తమ కంటైనర్ లో నింపాలి. ఈ టాస్క్ లో అర్జున్, భోలె, అశ్విని, సందీప్ ఆడారు. స్పాంజ్ ను పూర్తిగా తడుపుకునేందుకు పోటీపడి మరీ ఆడారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకున్నారు. అర్జున్ అయితే అశ్వినిని కింద పడేశాడు.
ఈ గేమ్ ముగిసిన తరువాత సందీప్, అర్జున్ ఆట తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఫిజికల్ చేయాలంటే రెండు నిమిషాలు పట్టదు. నా పీక పట్టుకుని తోసాడు. ఆ పిల్లను ఒక్క తోపు తోస్తే కింద పడింది అంటూ అర్జున్ మీద మండిపడ్డాడు. ఈ టాస్క్ లో సందీప్ గెలిచాడు.