టిల్లు స్క్వేర్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. రిలీజ్ డేట్ అప్పుడే.. ?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా టిల్లు మూవీ వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ కూడా మరింతగా పెరిగింది. ఇక దీనికి సీక్వెల్ గా ప్ర‌స్తుతం టిల్లు స్క్వేర్ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫ‌నీ ట్రాక్ వీడియోతో పాటు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతున్నట్లు మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు.

మా టిల్లు 2 టీం నుంచి అక్టోబ‌ర్ 27న (ఈ రోజు) ఉదయం 11:07 గంటలకు మేజర్ అప్డేట్ అందిస్తున్నాం.. వేచి ఉండండి మిస్ అవ్వద్దు అంటూ ట్విట్‌ చేశారు. ఇంతకీ ఈ కొత్త అప్డేట్ ఏంటి అనేది సస్పెన్స్ లో పెట్టారు టీం. సిద్దు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ టాక్సీలో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న పోస్టర్ ఇప్పటికే బాగా వైరల్ అయింది. అయితే మేకర్స్ సస్పెన్స్ లో పెట్టిన అప్డేట్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనే అంశాన్ని కొంతసేపటి క్రితం ప్రకటించారు.

సినిమా రిలీజ్ క్వాలిటీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండకూడదనే ఉద్దేశంతో సినిమా రిలీజ్ ను ఆలస్యం చేస్తూ వచ్చిన టీమ్ ఫైనల్ గా ఫిబ్రవరి 9న రిలీజ్ చేయబోతున్నట్లుగా ఓ పోస్టర్ రిలీజ్ రూపంలో అనౌన్స్ చేశారు. అయితే గతంలో డీజే టిల్లుతో ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అందించిన సిద్దు జొన్నలగడ్డ ఈసారి టైటిల్ కు తగ్గట్టుగానే టిల్లు స్క్వేర్ లో డబల్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాడట. సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీలో మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి కీ రోల్స్‌లో నటిస్తున్నారు.