తమలపాకులతో డాండ్ర‌ఫ్ ఫ్రీ తిక్ హెయిర్ మీ సొంతం..!!

చిన్ని చిట్కాలతో కూరగాయలను, పండ్లను పాడవకుండా రక్షించుకోవచ్చు. అలాగే ఇంట్లో అందుబాటులో దొరికే వాటితోనే స్కిన్‌ని , హెయిర్ ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సులభమైన పద్ధతిలో ఆరోగ్యకరమైన చిట్కాలను ఫాలో అవుతూ మన ఇంటిని.. ఆరోగ్యాన్ని ఈజీగా రక్షించుకోవచ్చు.

దానికి కావాల్సింది కాస్త ఓపిక. ఇక ఈ రెమిడీస్ వల్ల ఎలాంటి హాని ఉండదు. ఈ రెమిడీలు కాస్త అనుభవం గడిచిన పెద్దలు లేదా ఆరోగ్య నిపుణులు సాయంతో ఈ ఆర్టిక‌ల్‌లో తెలిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వచ్చే సమస్య జుట్టు రాలడం. ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. 20 తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టు చేయాలి.

ఆ పేస్టులో టీస్పూన్ నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి వెంట్రుకల చివరల వరకు పట్టించాలి. గంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలడం, చుండ్రు లాంటి సమస్యలు దరి చేరవు. అంతేకాకుండా జుట్టు పెరుగుదల కూడా పుష్కలంగా ఉంటుంది.