ప్రశాంత్, శివాజీ ముందే ప్లాన్ వేసుకున్నారు… సంచలన వ్యాఖ్యలు చేసిన నటరాజ్ మాస్టర్…!!

బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు సగానికి పైగానే పూర్తయింది. ఇప్పటికే 7 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఉల్టా పుల్టా పేరుతో రతిక రీ ఎంట్రీ వల్ల షో పట్ల మరింత బజ్ క్రియేట్ చేయాలని బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. మరోవైపు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆటలో వినిపించే బూతులను కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. భోలె, అమర్ చేసిన వ్యాఖ్యలు అందులో భాగమే.. ఇన్ని చూస్తున్న ఆడియన్స్ లో అనుకున్నంత రీచ్ అయితే ఈ సీజన్ చేరుకోలేదని తెలుస్తుంది. తాజాగా ఈ సీజన్ పై కొరియోగ్రాఫర్, డాన్సర్, బిగ్ బాస్ సీజన్ 5 కంటిస్టెంట్ నటరాజ్ మాస్టర్ తనదైన శైలిలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ వారి ఆట తీరుపై ఆయన స్పందించాడు.

” సమాజంలో పొలిటికల్ ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకే శివాజీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి మాయామర్మం చేయకపోతే జనాలు నమ్మరు. ఉదాహరణకు సత్యసాయిబాబ నోటి నుంచి శివలింగం, చేతి నుంచి విభూతి తీసి ప్రజలను ఎలా నమ్మించారో తెలిసిందే. అలాగే శివాజీ కూడా ఒక రైతు బిడ్డకు సాయం చేస్తూ తన ఇమేజ్ను పెంచుకునేందుకు, ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకు ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది. హౌస్ లో ప్రశాంత్, యావర్ కు మాత్రమే శివాజీ సపోర్ట్ గా ఉంటున్నాడు. వారిద్దరూ కాకుండా మరో వ్యక్తి ఉంటే చూపించండి.

యావర్ కు పెద్దగా తెలుగు రాదు కాబట్టి కొంత వరకు మొదట్లో ఇబ్బంది పడేవాడు. అలాంటి వ్యక్తుల పట్ల ప్రజల్లో ఒక సానుభూతి క్రియేట్ అవుతుంది. మ‌న ఇండియన్స్‌ అంతా సెంటిమెంట్‌కు పడిపోతాం. అది మన బ్లడ్ లోనే ఉంది. అందుకే రైతుబిడ్డ అని చెప్పగానే ప్రశాంత్ పై సానుభూతితో కూడిన అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఈ పాయింట్ లోనే తెలివిగా శివాజీ అందిపుచ్చుకున్నాడు. అందుకే ప్రశాంత్ కు ప్రతి విషయంలో శివాజీ సపోర్ట్ చేస్తున్నాడు. వీరిద్దరూ కూడా బిగ్ బాస్ ఎంట్రీ కి ముందే బయట మాట్లాడుకుని వెళ్లారని తెలుస్తుంది. ఇది నా అభిప్రాయం.

వారిద్దరూ సోషల్ మీడియాలో గుర్తింపు ఉన్న ఓ యూట్యూబ్ ఛానల్ కు వేరువేరుగా ఇంటర్వ్యూ ఇచ్చిన తరువాత బిగ్ బాస్ లోకి వచ్చారు. హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచే వారి ప్లాన్ను అమలు చేశారు. అందులో భాగంగానే ప్రశాంత్ నువ్వు గెలవాలి రా అని శివాజీ పదేపదే అంటున్నాడు. ప్రశాంత్ గెలిస్తే బిగ్ బాస్ లోకి శివాజీ ఎందుకు వెళ్లినట్లు అని నటరాజ్ ప్రశ్నించాడు. అంతేకాకుండా చాలామంది యూట్యూబర్స్, పలు సోషల్ మీడియాలను రన్ చేస్తున్న వారిని పల్లవి ప్రశాంత్, ముందే కలిసి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడని నటరాజ్ మాస్టర్ చెప్పాడు.

బిగ్ బాస్ లోకి వెళ్లాలని అతను గత మూడేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. బిగ్ బాస్ ఫ్యాన్స్ పేజీలు ఉన్న వాళ్ళందరినీ ప్రశాంత్ ముందే కలిశాడు. ఇలా గ్రౌండ్ వర్క్ చేసే బిగ్ బాస్ లోకి వెళ్ళాడు. వాటన్నిటికీ తోడు శివాజీ ఇస్తున్న సపోర్ట్ వల్ల కూడా ప్రశాంత్ స్ట్రాంగ్ అయ్యాడు. కానీ రైతుబిడ్డ మాత్రం హౌస్ లో ప్రశాంత్‌లో కనిపించడం లేదు. అతనిపై సినిమా ప్రభావం ఎక్కువ ఉంది. అతని నామినేషన్ ప్రక్రియ చూస్తున్నప్పుడు ఆ సినిమాల ప్రభావం ఈజీగా కనిపిస్తుంది ” అంటూ నటరాజ్ మాస్టర్ వ్యాఖ్యలు చేశాడు.