శ్రీ లీల క్రేజీ డెసిషన్ ….షాక్ లో దర్శక నిర్మాతలు!

సినిమా పరిశ్రమలో ప్రతి తరంలోను చిరస్మరణీయంగా మిగిలిపోయే హీరోయిన్ ఒకరు ఉంటారు. మహానటి సావిత్రి, సౌందర్య, శ్రీ దేవి, సమంత….ఇలా కొందరు హీరోయిన్లను అభిమానులు సినిమాలలో చూసి మర్చిపోకుండా, తమ మనసులలో చెరగని ముద్ర వేసుకుంటారు. ఈ జెన్ జీ యుగంలో ఆ దిశగా దూసుకుపోతున్న హీరోయిన్ ఎవరు అంటే….ప్రస్తుతం అందరి నోటా వినిపించే పేరు శ్రీ లీల. ఈమె ఆ ఘనత సాధిస్తుందో లేదో పక్కన పెడితే, ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. రోషన్ హీరోగా, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన “పెళ్లి సందడి” చిత్రంతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయమైన శ్రీ లీల, ఆ తరువాత రవి తేజ తో కలిసి “ధమాకా” చిత్రంలో నటించింది.


ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తరువాత రామ్ పోతినేని హీరోగా, బోయపాటి శ్రీను తెరకెక్కించిన “స్కంద” చిత్రం లో కూడా నటించింది. ఐతే ఈ చిత్రం భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఇప్పుడు తాజాగా బాల కృష్ణ హీరోగా తెరకెక్కిన “భగవంత్ కేసరి” చిత్రంలో విజ్జి పాపా పాత్రలో అదరగొట్టేసింది శ్రీ లీల. ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

తరువాత వైష్ణవ తేజ్ తో “ఆదికేశవ” చిత్రంలో మెరవబోతోంది ఈ బ్యూటీ. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఇంటర్వూస్ ఇచ్చింది శ్రీ లీల. ఒక ఇంటర్వ్యూలో “మీరు లిప్ లాక్ సీన్ చేయవలసి వస్తే ఏ హీరోతో చేస్తారు?” అని అడగగా, ఆమె వెంటనే అసలు తాను లిప్ లాక్ స్కీన్లు చెయ్యనని సమాధానం ఇచ్చింది. తనకు డాన్స్ అంటే ఇష్టమని, అందుకే సినిమాలలో ఎంత కష్టమైన డాన్స్ చేస్తానని, కానీ రొమాంటిక్ స్కీన్లకు దూరంగా ఉంటానని చెప్పేసింది శ్రీ లీల. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న శ్రీ లీల, ఇలాంటి కామెంట్స్ చెయ్యడం కాస్త ఆశ్చర్యంగానే ఉన్న, భవిష్యత్తులో కథ డిమాండ్ చేస్తే ఆమె మనసు మార్చుకుంటుందేమో వేచి చూడాలి. భగవంత్ కేసరి చిత్రంతో మళ్ళి హిట్ ట్రాక్ ఎక్కిన ఈ అమ్మడు, ఆదికేశవ చిత్రంతో ఆ ట్రాక్ ను కొనసాగించాలని చూస్తోంది. ఆమె నితిన్ తో నటిస్తున్న “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” కూడా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలకు సిద్ధం అవుతోంది.