ఓటిటి లోకి రాని స్కంద మూవీ.. కారణం..?

హీరో రామ్ పోతినేని వారియర్ సినిమా తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటించారు.. ఆ సినిమానే స్కంద.. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.. సలార్ సినిమా వాయిదా పడడంతో ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల చేయడం జరిగింది. మొదటిసారి డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించారు.

ఇందులో రామ్ ఎనర్జీటీకి, యాక్షన్ తోడు కావడంతో టాలీవుడ్ వర్గాలలో ఈ సినిమా పైన మంచి క్యూరియాసిటీ నెలకొంది.. ఎప్పుడు లవర్ బాయ్ గా కనిపించె రామ్ ఈసారి ఏకంగా మాస్ హీరోగా చూపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగులు ఫైట్లు సైతం ఆకట్టుకున్నాయి. హీరో రామ్ కెరియర్ లోనే భారీ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా స్కంద నిలిచిపోయింది.ఈ సినిమా రెండు వారాలలో ప్రపంచవ్యాప్తంగా 32 కోట్ల రూపాయల షేర్ తో పాటు 57 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించింది.

47 కోట్ల రూపాయల టార్గెట్ తో ఈ సినిమా బరిలోకి దిగాక దాదాపుగా అన్ని ఏరియాలలో 74% పైగా రికవరీ సాధించినట్లు సమాచారం. స్కంద మూవీ విడుదలైన 50 రోజులలోపే ఓటీటిలోకి రావాలి. దీంతో ఈ నెల 27వ తేదీన స్ట్రిమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ సినిమా స్ట్రిమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మేకర్ దీపావళికి స్ట్రిమ్మింగ్ రాబోతోందని తెలియజేస్తున్నారు. ఈ సినిమా హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 35 కోట్ల రూపాయలకు అన్ని భాషలలో కొనుక్కున్నట్లు తెలుస్తోంది.