ఉత్తరాంధ్రలో ” సలార్ ” సినిమాకి భారీ రేటు.. ప్ర‌భాస్ మానియా స్టార్ట్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ” సలార్ ” . ఈ సినిమా రిలీజ్ ని మేకర్స్ డిసెంబర్ కి ఫిక్స్ చేయగా.. ఈ భారీ సినిమా అయితే ప్రభాస్ కెరీర్ లోనే ఒక మాసివ్ బిజినెస్ ని లోడ్ చేసుకుంటుంది.

గతంలో రిలీజ్ అయిన ఆదిపురుష్ కే స్టేట్స్ లో సెన్సేషనల్ బిజినెస్ జరిగింది అనుకుంటే ఇప్పుడు సలార్ కి అంతకు మించిన రేట్లు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా అయితే ఉత్తరాంధ్ర థియేట్రికల్ బిజినెస్ విషయంలో లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. దీని ప్రకారం ఒక్క ఉత్తరాంధ్ర హక్కులే ఈ సినిమాకి ఏకంగా 20 కోట్ల మేర పలికిందట.

దీనితో సలార్ బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. ఇక ఈ సినిమా కనక సూపర్ హిట్ అయితే ప్రభాస్ కెరీర్ కు తిరుగులేని స్థాయిలో గుర్తింపు దక్కుతుందని తమ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.