ట్రెండీ స్టిల్స్ తో పిచ్చెక్కిస్తున్న ఆపిల్ బ్యూటీ…..సెకండ్ ఇన్నింగ్స్ తో యమా బిజీ.

తెలుగు సినిమా ప్రేక్షకులకు ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ పేరు కొత్తేమి కాదు. చిన్న వయసు లోనే హ్రితిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం కోయి మిల్ గయా చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి ప్రవేశించిన హన్సిక, చాలా ఏళ్లుగా, ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. మొదటిసారిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో హీరోయిన్ గా నటించిన హన్సిక, మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తరువాత టాలీవుడ్ స్టార్ హీరోలు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రవి తేజ వంటి వారితో నటించి ఆకట్టుకుంది. 17 ఏళ్లపాటు వరుస అవకాశాలతో దూసుకుపోయిన హన్సిక, కొన్నాళ్లుగా సినిమాలకు దూరాంగా ఉంటోంది. కారణం గత ఏడాది ఆమెకు వివాహం జరగడమే. హన్సిక 2022 డిసెంబర్ 4 న, ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ ఖతురీయా ను వివాహమాడింది.

ఐతే తాగాజా ఈ అమ్మడు మళ్ళి తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. చేతినిండా సినిమాలతో చాలా బిజీ గా ఉంది ఈ ఆపిల్ బ్యూటీ. ఐతే తాను ఎంత బిజీ గా ఉన్నప్పటికీ హన్సిక సోషల్ మీడియా లో ఆక్టివ్ గానే ఉంటుంది. తాను వొకేషన్లలో, టూర్లలో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ బుట్టబొమ్మ దుబాయ్ లో ఎంజాయ్ చేస్తుంది. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా దగ్గర్లో ఉన్న ఒక హోటల్ లో ఉంటున్న హన్సిక, ఆ నగర అందాలు కనిపించేలా ఫోటోలు తీసుకొని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. సిటీ విషయాన్నీ పక్కన పెడితే, కుర్రాళ్ళు మాత్రం హన్సిక అందానికి మంత్రముగ్ధులవుతున్నారు. కాటుక కళ్ళతో, క్రేజీ స్టిల్స్ తో అభిమానులతో పాటు, నెటిజన్లను కూడా ఫిదా చేసింది ఈ బ్యూటీ. ఆమె పోస్ట్ చేసిన ఈ ఫోటోలను అభిమానులు లైక్స్, కామెంట్స్ తో తెగ వైరల్ చేస్తున్నారు. హన్సిక ప్రస్తుతం తమిళంలో గాంధారి, మ్యాన్, రౌడీ బేబీ చిత్రాలలో నటిస్తోంది. అలాగే తెలుగులో 105 మినిట్స్, మై నామ ఈజ్ శృతి చిత్రాలలో నటిస్తోంది.