మరోసారి పవన్ కళ్యాణ్ ట్రెండ్ ని ఫాలో అవుతున్న నితిన్…!!

యంగ్ హీరో నితిన్ కి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. నితిన్ వరుస ప్లాపుల్లో ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ కూడా వరుస ప్లాపుల్లో ఉన్నాడు. అయినప్పటికీ తన ” ఇష్క్ ” సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ ను గ్రాండ్గా పిలిచి.. పవన్ గొప్పతనం అందరికీ తెలిసేలా చేశాడు. 2012లో పవన్ కళ్యాణ్ ” గబ్బర్ సింగ్ ” తో.. నితిన్ ” ఇష్క్ ” తో కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. అప్పటినుంచి తన ప్రతి సినిమాలోని పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఉండేలా చూసుకుంటూ వచ్చాడు.

ఈ క్రమంలో ” గుండెజారి గల్లంతయిందే , అఆ, భీష్మ వంటి విజయాలు అందుకున్నాడు. ఇప్పటికీ తన సినిమాల్లో ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు వాడుకుంటూనే ఉన్నాడు అని నితిన్ ని అడగగా..” నేను నా మొదటి సినిమా ‘ జయం ‘ నుంచి పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు వాడుతున్నాను. మీరు కరెక్ట్ గా చూస్తే అర్థమవుతుంది ” అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఆ విషయాలు పక్కన పెడితే. నితిన్ ప్రస్తుతం ‘ ఎక్స్ట్రా ” అనే సినిమాలో నటిస్తున్నాడు.

వక్కంతం వంశి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ట్రైలర్ ను అక్టోబర్ 30న విడుదల చేయబోతున్నట్లు తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది చిత్ర బృందం. ఈ పోస్టర్లో నితిన్..” తమ్ముడు ” లో పవన్ కళ్యాణ్ లా లుంగీ ధరించి రెడ్ కలర్ షర్ట్ అలాగే మెడలో రెడ్ టవల్ వేసుకుని.. పవన్ కళ్యాణ్ అభిమానుల అటెన్షన్ ను డ్రా చేసే ప్రయత్నం చేశాడు.