ఆ తీర్థంలో ఇప్పటికీ అంతుచిక్కని కోనేరు రహస్యం..?!

మనదేశంలో ఎన్నో ప్రధానమైన పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి. అలాగే అ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఎన్నో రహస్యాలు ఇప్పటికీ అంత చిక్కవు. పుణ్యక్షేత్రాలలో ప్రతి ఏడాది ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో మహానంది పుణ్యక్షేత్రం ఒకటి. మహానంది పుణ్యక్షేత్రంలో ఉన్న కోనేరు అద్భుతం అనే చెప్పాలి. కాలాలతో సంబంధం లేకుండా నిండుకుండలా ఈ కోనేరులో నీరు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. కోనేరు చుట్టుపక్కల వందలాది ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.

 

అయితే ఆ నీరు ఎక్కడ నుంచి వస్తుందని రహస్యాన్ని చేదించేందుకు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వానాకాలంలో అంటే కోనేరు సాధారణంగా నీరు ఉంటుంది. కానీ ఎండాకాలంలో కూడా నిండుకుండలా ఉంటుంది ఇందులో ఐదు ధారలుగా వచ్చి పడే నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవరికి తెలియదు. కోనేరులో స్నానం ఆచరిస్తే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని పండితులు చెబుతారు. భక్తులు కూడా దీనిని బాగా నమ్ముతారు. దేశ నలమూలల నుంచి కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.

మహానంది క్షేత్రాన్ని తీర్థ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయంలో శ్రీ మహానందిశ్వర స్వామి విగ్రహం కింద నుంచి నీరు ప్రవహిస్తూ రుద్ర‌గుండం కోనేరులోకి.. అక్కడి నుంచి మహావిష్ణు గుండం కోనేరులోకి ప్రవహిస్తుంది. ఈ నీరు మహానంది చుట్టుపక్కల 100 ఎకరాల పంట పొలాలకి సాగు చేస్తుంది. ఈ చుట్టుపక్కల ఏ ప్రాంతంలో తవ్విన 10 అడుగుల లోనే నీరు ఉపొంగుతుంది. మహానంది క్షేత్రంలో కోనేరు నీరు ఎక్కడి నుంచి వస్తుందో అంతు పట్టని రహస్యమేనంటూ స్థానికులు కూడా చెబుతున్నారు. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి ఇప్పటికే చాలామంది ప్రయత్నాలు చేశారు.. కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు.