కాబోయే కోడలు పిల్ల లావణ్య కోసం .. మెగా హీరోలు భారీ త్యాగం.. చిరంజీవి కూడా నా..?

త్వరలోనే మెగా హీరో వరుణ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు అన్న విషయం మనందరికీ బాగా తెలిసిందే. ఇన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట ఫైనల్లి కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ ఇటలీలో గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతున్నారు . నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

అంతేకాదు వీళ్ళ పెళ్లి ఇటలీలో జరగబోతూ ఉండడంతో వారం ముందుగానే మెగా ఫ్యామిలీ అక్కడకు వెళ్ళిపోబోతున్నట్లు తెలుస్తుంది . అయితే మెగా ఫ్యామిలీలో ఉండే ఆల్మోస్ట్ అందరూ హీరోలు ఈ పెళ్లి కోసం దాదాపు వారం రోజులపాటు తమ బిజీ షెడ్యూల్స్ ను పోస్ట్ పోన్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమా షెడ్యూల్స్ పోస్ట్ పోన్ చేసుకుని వరుణ్ పెళ్లికి అటెండ్ కాబోతున్నాడట .

అందరూ ముందుగా రెండు రోజులు వర్క్స్ ఆపుకోవాలని అనుకున్నారట . కానీ మెగాస్టార్ చిరంజీవి ఆర్డర్స్ ప్రకారమే అందరూ వారం రోజులు ముందే ఇటలీకి చేరుకోవాలని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారట . దీంతో మెగా హీరోలు అందరూ లావణ్య కోసం వారం రోజులు తమ కాల్ షీట్స్ త్యాగం చేసేసారు..!!