మొద‌టి సినిమాతోనే హిట్ కొట్టిన ఎన్టీఆర్ బామ్మర్ది.. `మ్యాడ్‌` 3 డేస్ట్ క‌లెక్ష‌న్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

చిన్న సినిమాలుగా వ‌చ్చి కొన్ని కొన్ని పెద్ద విజ‌యం సాధిస్తుంటాయి. గ‌త వారం విడుద‌లై `మ్యాడ్‌` మూవీ ఈ కోవ‌కే చెందుతుంది. జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్, హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఈ సినిమాతోనే హీరోలుగా పరిచయమయ్యారు. మొద‌టి సినిమాతోనే హిట్ కొట్టారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించాడు.

గౌరి ప్రియా, అనంతిక, గోపిక ఈ సినిమాల్లో హీరోయిన్లుగా న‌టించారు. యూత్ ఫుల్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న మ్యాడ్‌.. అక్టోబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ పోటీ న‌డుము అదిరిపోయే వ‌సూళ్ల‌తో మూడు రోజుల్లోనే క్లీన్ హిట్ గా నిలిచింది. మ్యాడ్ 3 డేస్ట్ క‌లెక్ష‌న్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

రూ. 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన మ్యాడ్ మూవీ.. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ. 3.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 4.25 కోట్ల రేంజ్ లో షేర్, రూ. 8.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చిన మ్యాడ్ కు ఈ రేంజ్ వ‌సూళ్లు రావ‌డంతో నిర్మాత‌ల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డంతో నార్నె నితిన్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలుపుతున్నారు.