భార్య లేచిపోయిందని పండగ చేసుకున్న భర్త.. ఫ్రెండ్స్ కు పెద్ద పార్టీ ఇచ్చి మరి..

ఇటీవల కాలంలో చాలా విచిత్రమైన ఘటనను మనం వింటున్నాం. అయితే తన భార్య.. ప్రియుడుతో లేచిపోవడంతో ఓ భర్త ఏకంగా 250 మందికి ఆల్కహాల్ పార్టీ ఇచ్చి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేరళలోని కోజికోడ్ లో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. కోజికోడ్ లోని వ‌డకారాలు ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఈ వీడియోని గమనిస్తే ఇందులో చాలామంది మందు తాగుతూ చిందేస్తున్నారు.

మోహన్ లాల్ సినిమా నరన్‌లోని పాటకు డ్యాన్స్ చేస్తూ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. ఓ ఇంటి ఆవరణలో ఈ పార్టీ జరిగిందని వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో నిజమైందా కాదా అనేది తేల్చాల్సి ఉంది. వీడియో క్యాప్షన్ మాత్రం భార్య లేచిపోయింది.. భర్త 250 మందికి మద్యం, ఆహారం పెట్టి వేడుక చేసుకుంటున్నాడు.. అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోను ఎవరు రికార్డ్ చేశారో కూడా వివరాలు లేవు. ఇక అక్టోబర్ 6, 2023న ఫేస్‌బుక్ వేదికగా ఈ వీడియోని షేర్ చేయగా ఇప్పటికే రూ. 8.5 లక్షల మంది పైగా చూసారు.

ఇక‌ ఈ వీడియో పై కామెంట్స్ వర్షం వెలువెత్తుతుంది. 1300కు పైగా కామెంట్స్ వచ్చాయి. చాలామంది ఆశ్చర్యపోతున్నారు.. కొంత మంది విడాకులు ఇచ్చేయడం బెటర్ కదా అంటూ.. ఇంకొందరు ఇలాగైతే దేశంలో వందల మంది పార్టీలు చేసుకోవాలి అంటూ.. ఇదెక్కడి ఆనందం రా బాబు అంటూ.. క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ది మోస్ట్ ఫనీయ‌స్ట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.