సినిమా హిట్ అవ్వడం కోసం ..నాగార్జున షర్ట్ లో అవి కుక్కించిన స్టార్ డైరెక్టర్.. రిజల్ట్ చూసి షాక్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగేశ్వరరావు గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఎన్నో మంచి మంచి సినిమాలో నటించి ఇండస్ట్రీకి క్రేజీ హిట్స్ అందించారు. కాగా అక్కినేని నాగార్జున ఎంతమంది డైరెక్టర్ తో నటించిన సరే రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ అంటే మాత్రం జనాలకి బాగా నచ్చుతుంది .

వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది . అయితే ఓ సినిమా విషయంలో అక్కినేని నాగార్జునను రాఘవేంద్రరావు గారు బరువు పెరగమంటూ సజెస్ట్ చేశారట . ఆ పాత్ర కోసం నువ్వు బరువు పెరిగితేనే బాగుంటావు అని సూచించారట . ఈ క్రమంలోనే ఆ సినిమాకి ఇచ్చిన టైం లోపు ఇన్ని కేజీల బరువు పెరుగు అంటూ చెప్పుకొచ్చారట .

కానీ నాగార్జున అంత రీచ్ కాలేకపోయాడు . దీంతో ఏమి చేసేది లేక ఇక ఆ సినిమా హిట్ అవ్వడానికి ఆయన అనుకున్న పాత్ర అనుకున్న విధంగా తెరకెక్కించడానికి నాగార్జున షర్ట్ ప్యాంట్ లోపల దూది పెట్టి మరి ఆయనను బొద్దుగా చూపించారట. ఫైనల్లీ సినిమా హిట్ అయింది రాఘవేంద్రరావు సో హ్యాపీ . అలా అనుకున్నది ఏదైనా సరే చేసి తీరుతాడు రాఘవేంద్రరావు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!