నోటి పూత సమస్య మాయం చేసుకోండి ఇలా..

మౌత్ అల్సర్ లేదా నోటి పూత వచ్చిందంటే ఆహారం తినాలన్నా, ఏమన్నా తాగాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యకు మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో చెక్ పెట్టవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

* నిమ్మ, తేనె:
ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి పుకిలించాలి. ఇలా చేయడం ద్వారా నోటి పూత తగ్గుతుంది.

* గ్లిజరిన్ , పసుపు మిశ్రమం:
నోటి పూతను తగ్గించడానికి గ్లిజరిన్, పసుపు మిశ్రమం ఎంతో బాగా పనిచేస్తుంది. చిటికెడు పసుపు, టీ స్పూన్ గ్లిజరిన్ తీసుకుని పేస్టులా చేసుకుని నోట్లో ఉన్న పూతపై అప్లై చేయాలి. ఇలా 10 నుంచి 20 నిమిషాలు ఉంచి తర్వాత గోరు వెచ్చని నీరుతో శుభ్రం చేసుకోవాలి.

* తులసి:
ప్రతిరోజు 5 నుంచి 6 తులసి ఆకులను నమలడం వల్ల నోటి పూత సమస్య తగ్గుతుంది.

* ఉప్పు:
ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ఉప్పు కలిపి అది పూర్తిగా కరిగిన తర్వాత ఆ నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజులో మూడు నుంచి నాలుగు సార్లు చేస్తే నోటిపూత తగ్గిపోతుంది.