అడ్రస్ లేకుండా పోయిన అవసరాల శ్రీనివాస్.. ఆ తప్పేనా..?

మొదట నటుడుగా అవసరాల శ్రీనివాస్ బాగానే పాపులారిటీ సంపాదించారు. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాలలో డైరెక్టర్ గా హీరోగా మెప్పించడానికి ట్రై చేసిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. నాగశౌర్య హీరోగా నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమా తెరకెక్కించగా ఈ సినిమా కూడా నిరాశనే మిగిల్చాయి.. దీంతో వరుసగా ప్లాపులు మూట కట్టుకోవడం జరిగింది అవసరాల శ్రీనివాస్. అవతార్ -2 సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ గా పనిచేయడం జరిగింది.

ఇక బ్రహ్మాస్త్ర సినిమాకి కూడా తెలుగు వర్షన్ డైలాగులు రాయడం జరిగింది. ఇలా అవసరాల కెరియర్ గత రెండేళ్లుగా సాగుతూనే ఉంది నటుడుగా మాత్రం గత ఏడాది విడుదలైన అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో నటించారు. ఇది కూడా ప్లాపుగా నిలిచింది. అయితే అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా బిజీ అవ్వాలని తప్ప నాతో ఉన్నట్లు అతని సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో పాన్ ఇండియాలో క్రేజీ తగ్గించుకోవడంలో మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది నుంచి అవసరాల శ్రీనివాస్ పలు రకాల సినిమాలకు రచయితగా పనిచేస్తున్నారని సమాచారంతోనే సరిపెట్టుకుంటున్నట్లు సమాచారం. నటుడుగా తనకు ఉండవలసిన గుర్తింపు ఎలాగైనా ఉన్నది కొత్తగా రచయిత పేరు వేసుకోవడం పైన పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లు లేదు..అంతేకాకుండా అవసరాల శ్రీనివాస్ కమెడియన్గా మంచి పాపులారిటీ అందుకున్నారు కానీ హీరోగా డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం వల్లే ఈ నటుడికి ఇలాంటి దుస్థితి ఎదురైందని చెప్పవచ్చు.. మరి అభిమానుల కోరిక మేరకు మళ్ళీ నటుడుగా నటిస్తారేమో చూడాలి మరి.