భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంటే.. విడాకులు తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుందో తెలుసా..?

ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడం ఎక్కువైపోయింది. దీనికి వయసు కూడా ఓ కారణమే. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే.. ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. అది ఎప్పుడైనా ఎవరి మీదైనా కలగవచ్చు అని చాలామంది అంటుంటారు. అవును ఏజ్ ఈస్ జస్ట్ ఏ నెంబర్.. కానీ అలా ఎప్పుడన్నా ఏ వయసులో అయినా కలిగేది అట్రాక్షన్ మాత్రమే కానీ ప్రేమ కాదంటున్నారు నిపుణులు. ప్రేమకు వయసుకు సంబంధం ఉంటుందట. మీరు ప్రేమించే వ్యక్తి వయసుకు మీ వయసుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే.. ఆ సంబంధం ఎక్కువ కాలం నిలబడదని నిపుణులు చెబుతున్నారు.

భార్యాభర్తల మధ్య ఏజ్‌ గ్యాప్ ఎంత ఉండాలి? ఎంత ఉంటే వాళ్ళ మధ్య గొడవలు రావు? విడాకులకి వయసుకు మధ్య ఎంత ముఖ్యమైన సంబంధం ఉంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా అందంగా ఉంటుందని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఎన్నో మార్పులు జరగొచ్చు. కానీ వివాహ జీవితం ఎక్కువ సంతోషంగా ఉండాలంటే.. భార్యాభర్తల మధ్య వయసు చాలా కీరోల్ ప్లే చేస్తుంది. కొంతమంది అమ్మాయిలు కంటే అబ్బాయిలు వయసు ఎంతో పెద్దగా ఉన్న పరవాలేదు అనుకుంటారు.

ఏడు, ఎనిమిదేళ్లు పెద్దగా ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేసేందుకు కూడా వెనకాడరు. అసలు భార్యాభర్తల మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలి? అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో నిర్మించిన పరిశోధన ప్రకారం.. భార్యాభర్తల మధ్య సరైన ఏజ్ గ్యాప్ మూడు నుంచి ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండాలట. ఈ పరిశోధన ప్రకారం, ఐదు సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉన్నవారు విడాకులు తీసుకునే అవకాశం 18 శాతం మాత్రమే ఉంటుందని తెలిపింది.

భార్యాభర్తల మధ్య 10 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉంటే వేడాకులు తీసుకునే అవకాశం 39% వరకు ఉంటుంది. దంపతుల మధ్య 20 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉంటే విడాకులు తీసుకునే అవకాశం 95% కంటే ఎక్కువగా ఉంటుంది. వివాహం కోసం భార్యాభర్తల మధ్య సరైన ఏజ్ గ్యాప్ ఉండాలి. ఏజ్ గ్యాప్ పెరిగితే ఇద్దరి మధ్య ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల రిలేషన్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.