వరుణ్ తేజ్ పెళ్లికి ఉపాస‌న‌కు లింక్ ఏంటి.. అస‌లు ట్విస్ట్ ఇదే..!

మెగా ఇంట్లో పెళ్లి భాజాలు మొదలయ్యాయి. సొట్ట బుగ్గల హీరోయిన్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ మూడు మూళ్ల బంధంతో ఒక్కటవ్వబోయ సమయం రానే వచ్చింది. ఐదేళ్లు నుంచి ప్రేమలో ఉండి.. ఇప్పుడు కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగులు వేయబోతున్నారు . కాగా ఓ వైపు పెళ్లి పనులు జరుగుతుండగా.. ఇటీవలే లావణ్య, వరుణ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ కూడా ఎంతో గ్రాండ్గా నిర్వహించారు.

ఇదంతా పక్కన పెడితే వీరి పెళ్లి బాధ్యతలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన చూసుకుంటున్నారని ఓ వార్త వైరల్ అవుతుంది. ఉపాసనకు ఫ్యాషన్ లో ఒక యూనిక్ టేస్ట్ ఉంది. ఆమె వేసుకునే డ్రెస్సుల్లో మంచి లుక్ కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. కాగా వరుణ్, లావణ్య పెళ్లి బట్టల విషయంలో కూడా ఉపాసన చేయి ఉన్నట్లు తెలుస్తుంది.

అలాగే అతిథులు ఎవరెవరిని పిలవాలి.. అన్న దగ్గర నుంచి వారికి ఎలాంటి భోజనం పెట్టాలి.. వెళ్లేటప్పుడు రిటన్ గిఫ్ట్ ఏం ఇవ్వాలి అనేది కూడా దగ్గరుండి మరీ చూసుకుంటుందని సమాచారం. ఈ పనుల్లో ఉపాసన వెంట వరుణ్ తల్లి, చెల్లి నిహారిక సాయం చేస్తున్నారట. ఇది ఎంతవరకు వాస్తవము తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.