రైతు బిడ్డ ఆ ప‌ని మాత్ర‌మే వ‌చ్చు… శివాజీ సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌..!

బిగ్ బాస్ హౌస్ లోకి కొత్తగా ఐదుగురు కంటిస్టెంట్లు వచ్చారు. దీంతో కాస్త జోష్ పెరిగింది. ఇప్పుడు అదే ఊపు కొనసాగుతూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. మరోవైపు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్సీని బిగ్ బాస్ పీకి పడేసాడు. అలానే అమర్దీప్ ఎలిమినేషన్ భయం నుంచి కాస్త బయటకు వచ్చాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందో ? ఇప్పుడు చూద్దాం. ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు మధ్య కెప్టెన్సీ కోసం పోటీ నడుస్తుంది. మంగళవారం గేమ్స్ సగంలోనే ఆగిపోయాయి.

అక్కడి నుంచి బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ఇక పోటీలో సరిగ్గా పర్ఫార్మ్ చేయలేకపోయానని అమర్దీప్ డల్ అయిపోయాడు. దీంతో యావర్ అతడికి మోటివేషన్ ఇచ్చాడు. రాత్రి నిద్రపోయే టైంలో అమర్దీప్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రియాంక, సందీప్ వచ్చి అతడిని ఓదార్చారు. ప్రశాంత్ కెప్టెన్ అయితే అయ్యాడు గాని పెద్దగా మార్పు లేదు. దీంతో బిగ్ బాస్ అతడి కెప్టెన్సీ ని డైరెక్ట్ గా రద్దు చేయొచ్చు గాని అలా చేయలేదు. ప్రశాంత్ మంచి కెప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు అని బిగ్ బాస్ అడగగా… శోభ, సందీప్, తేజ తప్ప అందరూ చెయ్యొత్తారు.

అయినా సరే బిగ్ బాస్ కనికరించలేదు. యావర్ ఇంగ్లీషులో మాట్లాడుతున్నా.. తేజ నిద్రపోతున్న.. ఇంట్లో రేషన్ అయిపోయిన ఏం చేస్తున్నావంటూ కెప్టెన్సీ ని తీసేసుకున్నారు. ఇక కెప్టెన్సీ ని తీసేసుకున్న తర్వాత రైతుబిడ్డ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కెప్టెన్సీ ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పుడేమో ఇంట్లో ఏడుస్తూ కూర్చున్నాడు. ఇలాంటి టైం లో మరోచోట కూర్చుని మాట్లాడిన శివాజీ.. వాడికి ఏడవడం తప్ప ఇంకేం రాదని అన్నాడు.

మంగళవారం ఎపిసోడ్లో కెప్టెన్సీ కోసం రెండు గేమ్స్ పెట్టిన బిగ్ బాస్.. ” హూ ఈస్ ఫాస్టెస్ట్ ” గేమ్ లో భాగంగా బిగ్బాస్ చెప్పిన రంగు ఉన్న ఏమైనా వస్తువులని తీసుకొచ్చి లైన్ లోకి మార్క్ చేసిన ప్లేసులో వెయ్యాలి. ఇందులో ఆటగాళ్లు గెలిచారు. ” హూ ఈజ్ స్ట్రాంగెస్ట్ ” అని పెట్టిన ఇంకో పోటీలో పోటుగాళ్లు గలిచారు. అలా నాలుగుటుల్లో 3 గెలిచిన పోటుగాళ్లు.. కెప్టెన్సీ పోటీలో నిలిచారు. ఇక్కడితో మంగళవారం ఎపిసోడ్ కంప్లీట్ అయింది.