బాహుబలి కోసం ప్రభాస్‌ను టార్చ‌ర్ చేసిన రాజ‌మౌళి… ఇన్నాళ్ల‌కు భ‌య‌ట‌ప‌డిందిగా..!

దర్మక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు దేశవ్యాప్తంగా ఈ దర్శకుడు పేరు మారుమోగుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన తరువాత ప్రపంచవ్యాప్తంగా పరిచయమయ్యారు రాజమౌళి. ప్రధానంగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో సీరియల్ దర్శకుడుగా పని చేశారు రాజమౌళి.

ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ 1 చిత్రానికి దర్శకుడుగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. అయితే తొలి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజమౌళి.. అనంతరం తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకుని నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొచ్చాయి. ఇలా ఇండస్ట్రీలో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను కూడా అందరికీ పరిచయం చేశాడు.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ బాహుబలి.. ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమా దర్మక నిర్మాతలు హీరోలు కూడా ఎంతో కష్టపడి పని చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి ప్రభాస్, రానా వంటి వారికి కఠినమైనటువంటి నియమాలను పెట్టి సినిమా షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తుంది.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం రాజమౌళికి ప్రభాస్ పెట్టిన కండిషన్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ప్రభాస్ బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో తన శరీర బరుగులో ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా ఉండటం కోసం కఠినమైనటువంటి డైట్ ఫాలో కావాలని ప్రత్యేకంగా ఒక డైటీషన్ను జక్కన్న ఏర్పాటు చేశారట. వారు చేసిన విధంగానే ప్రభాస్ ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి ఈయన ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డారని తెలుస్తుంది.

బాహుబలి 2 షూటింగ్ సమయంలో మాత్రం ప్రభాస్ రాజమౌళికే కండిషన్ పెట్టాడట. నేను ఈ సినిమాలో నటించాలి అంటే మీరు నేను పెట్టే కండిషన్ కి తప్పకుండా ఒప్పుకోవాలని.. అప్పుడే నేను ఈ సినిమా షూటింగ్ చేస్తానని ప్రభాస్ జక్కన్న కి కండిషన్ పెట్టాడట. మరి ఆయన పెట్టిన ఆ కండిషన్ ఏంటి అనే విషయానికి వస్తే.. నేను మీరు చెప్పిన డైట్ కేవలం షూటింగ్ సమయంలో మాత్రమే ఫాలో అవుతాను ఇతర సమయాల్లో నాకు నచ్చిన విధంగా నాకు ఇష్టమైన ఫుడ్ తీసుకుంటాను అని చెప్పాడట.

అందుకు మీరు ఈ కండిషన్ కి ఒప్పుకుంటేనే నేను ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటానని రాజమౌళికి చెప్పాడట. సాధారణంగా ప్రభాస్ మంచి ఫుడీ అనే విషయం మనకు తెలిసిందే. వివిధ రకాల ఆహార పదార్థాలతో ఎంతో ఇష్టంగా ఫుడ్ తీసుకునే ప్రభాస్ ని ఇలా కట్టడి చేయడంతో ఆయన ఫుడ్ విషయంలో రాజమౌళికే కండిషన్ పెట్టాడట. ఇలా ఫుడ్ విషయంలో ప్రభాస్ పరిస్థితి గమనించిన రాజమౌళి ఆ కండిషన్ కి ఒప్పుకుని బాహుబలి 2 మూవీ షూటింగ్ పూర్తి చేశారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.