అమర్దీప్‌కు సపోర్ట్ చేస్తూ అరియానా వీడియో… అడ్డంగా దొరికేసిందిగా…!

బిగ్బాస్ సీజన్ 7 టాస్క్ లతో ప్రతివారం చాలా రసవత్తంగా సాగుతుంది. ఇందులో సీరియల్ హీరో అమరదీప్ పాల్గొన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నాగార్జునతో..ఇటు బిగ్ బాస్ తో తిట్లు తింటున్నాడు. ప్రతివారం నామినేషన్స్ లో ఉంటూ ఏదో రకంగా తప్పించుకుంటున్నాడు. ప్రతివారం గేమ్ ను ఇంప్రూవ్ చేసుకుంటా అని చెబుతూనే ఉన్నాడు. కానీ గేమ్ మాత్రం ఇంప్రూవ్ చేసుకోవడం లేదు. దీంతో అమర్ దీప్ పై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా, అమర్ కు సపోర్ట్ చేసి ప్రేక్షకులు చేత ట్రోల్స్ కు గురైంది. ఆ అమ్మడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా అమర్ కు మద్దతు తెలిపింది. ” అమర్ కచ్చితంగా ట్రాక్ లోకి వచ్చాడు. టైం కలిసి రావడం లేదు. హౌస్ లో ఉన్న వారు కాకుండా కొత్తగా వచ్చినవారు కూడా అమర్ కు చాలా కావాల్సిన వాళ్ళు.

తన ఫ్రెండ్స్ తనను నామినేట్ చేశారు అర్థం చేసుకుంటారు అనుకున్నాడు. కానీ వాళ్లు కూడా తనను ఎలిమినేట్ చేయడంతో డిస్ పాయింట్ అయ్యాడు. అమర్ ది మంచి మనసు కానీ ఎవరికీ అర్థం కావడం లేదు. లెటర్ వచ్చినప్పుడు అది చదివి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు “. మొత్తానికి అరియానా అమర్ కు సపోర్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. దీంతో అది చూసిన ప్రేక్షకులు ఓ రేంజ్ లో తిట్టుపోస్తున్నారు. అంతేకాదు నెగిటివ్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇది అమ‌ర్‌కు ప్ల‌స్ క‌న్నా మైన‌స్ అయ్యేలా ఉంది.

 

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)