” భగవంత్ కేసరి ” ప్రీసేల్స్ కేక‌.. ఏంది బాల‌య్యా ఈ క్రేజ్‌…!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” భగవంత్ కేసరి “. మరి బాలయ్య హీరోగా నటించిన గత సినిమాలు సెన్సేషనల్ సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తుండగా.. ఈ సినిమా యుఎస్ లో అయితే గ్రాండ్ గా తన కెరీర్ బిగ్గెస్ట్ రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రీసేల్స్ ఇప్పుడు స్ట్రాంగ్ గా వెళ్తున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి యూఎస్ లో ఆల్రెడీ లక్ష 50 వేలకి పైగా డాలర్స్ గ్రాస్ నీ క్రాస్ చేసింది.

దీంతో భగవంత్ కేసరి ముందు రోజుల్లో మరిన్ని బెటర్ వసూళ్లు అందుకోనుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్రలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.