నల్లదాక్షతో యంగ్ లుక్.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..!!

ఎల్లప్పుడూ ఎవరైనా కోరుకునేది తమ మొహం కాంతివంతంగా, అందంగా ఉండాలని.. దానికోసం అనేక పాట్లు కూడా పడుతూ ఉంటారు. అలాగే వేల‌కు వేలు డబ్బులు కూడా పోస్తు ఉంటారు. సహజంగా ఇంట్లో తయారు చేసుకున్న వాటితో వ‌చ్చే గ్లో ఇంకెక్కడ రాదని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పబోయే చిట్కాతో మీ మొహాన్ని అందంగా చేసుకోవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం.

1. నల్ల ద్రాక్షతో ఫేషియల్.. మరింత యంగ్‌లుక్ లోకి.. నల్ల ద్రాక్ష పండ్లను పేస్టులా చేసుకోవాలి. ఇందులో ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ బాగా కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట పాటు ఆరబెట్టాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

2. కొన్ని నల్ల ద్రాక్షాలను బాగా స్మాష్ చేసిగుజ్జు తీయాలి. దీనిలోకి ఒక చెంచా పంచదార, చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి సున్నితంగా మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మొహం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే ముఖం కాంతివంతంగా, యంగ్ లుక్స్ తో కనిపిస్తుంది.

3. టమాటో స్మాష్ చేసి అందులో ద్రాక్ష పండ్లను జోడించి మొత్తాన్ని పేస్టులా చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడకు అప్లై చేస్తే మొఖం కాంతివంతంగా కనిపిస్తుంది.