‘ టీచర్ ‘ రోల్‌లో ప్రేక్ష‌కుల‌ని మెపించిన‌ హీరోయిన్‌లు వీళ్లే….!!

కొందరి హీరోయిన్లు టీచర్స్ గా నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నటనతో, అందంతో, కట్టుబొట్టుతో అందరిని అలరించారు. ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. ధనుష్ సార్ (తమిళ్లో ‘ వాతి’) సినిమాలో కాలేజీ లెక్చరర్ మీనాక్షి గా సంయుక్త మీనన్ నటించిన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

2. ‘ గార్గి ‘సినిమాలో స్కూల్ టీచర్ గా నటించి మెప్పించింది సాయి పల్లవి.

3. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘ వెంకీమామ ‘ సినిమాలో పాయల్ రాజ్ పుత్ టీచర్ గా నటించింది.

4. ‘ ప్రేమమ్ ‘ సినిమాలో టీచర్ గా గుర్తుండిపోయే పాత్రలో నటించిన శృతిహాసన్.

5. ‘ హ్యాపీ డేస్ ‘ మూవీలో లెక్చరర్ పాత్రలో కనువిందు చేసింది కమల్‌ని ముఖర్జీ.

6. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ ఘర్హణ ‘ లో టీచర్ మాయగా అసిన్ నటించి మెప్పించింది.

7. రవితేజ హీరోగా నటించిన ‘ ఖతర్నాక్ ‘ సినిమాలో ఇలియానా టీచర్ గా నటించింది. అప్పట్లో ఈమె పాత్ర వివాదమైంది.

8. ‘ నేనే అంబానీ ‘ సినిమాలో టీచర్ పాత్రలో మెరిసింది నయనతార.

9. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ స్కూల్ టీచర్ గా నటించింది.

10. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ కరెంట్ తీగ ‘ సినిమాలో సన్నీ లియాన్ టీచర్ గా నటించి కాసేపు కనువిందు చేసింది.