పదేళ్ల తర్వాత డైరెక్ట‌ర్ ట్విట్‌కి సమాధానం ఇచ్చిన త్రిష.. షాక్‌లో నెటిజ‌న్లు..!

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది త్రిష. తర్వాత వరస లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించింది. ఆ సినిమాలన్నీ పరాజయం కావడంతో ఇక ఈమె కెరీర్‌ ముగిసినట్లేనని అందరూ భావించారు. అయితే ఇటీవల వచ్చిన ‘ పోనియన్ సెల్వన్ 2 ‘ సినిమాతో ఆమె అనూహ్యంగా విజయాల బాట పట్టింది.

ప్రస్తుతం త్రిష చేతిలో ఆరడజన్ సినిమాలకు పైగా అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది త్రిష‌. ప్రస్తుతం అపోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే వెంకటేష్ – త్రిష జంటగా నటించినా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో త్రిష నటించిన సంగతి తెలిసిందే. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి సక్సెస్‌ను సాధించింది.

ఈ సినిమా తనకు గొప్ప జ్ఞాపకాలను మిగిల్చిందని అవకాశం వస్తే వెంకటేష్ – త్రిష కాంబోలో ఈ సినిమాకి సిక్వెల్ చేయాలనుకుంటున్నానని దర్శకుడు సెల్వరాగవ‌న్‌ 2013లో ట్విట్ చేశాడు. దానిపై త్రిష ఇన్నాళ్లకు స్పందించింది. ” నేను రెడీ.. ” అంటూ ట్విట్టర్ లో పేర్కొంది. దశాబ్దం క్రితం చేసిన ట్విట్‌కి ఇప్పుడు రిప్లై ఇవ్వడంతో నెటిస‌న్లు షాక్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం త్రిష నటించిన రోడ్ సినిమా త్వరలో విడుదల కాబోతుంది.